17 April, 2026 | 11:02 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మూడున్నరేళ్లలో 20 లక్షల ఇండ్లు

23-06-2025 01:24 AM

- ఆగస్టు 15 నాటికి భూభారతితో రైతులకు స్వాతంత్రం 

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

- నకిరేకల్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ 

నల్లగొండ టౌన్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా రానున్న మూడున్నర ఏళ్ల లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొ దటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు తెలిపారు. భూభారతి అమలులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఆగ స్టు 15 నాటికి వీటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి రైతులకు స్వతంత్రాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, లబ్ధిదారులు 400, 600 చదరపు అడుగులలో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. గతంలో చేపట్టి మొండిగోడలుగా దర్శనమిస్తున్న ఇళ్లకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

భూ భారతిపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు రాబోయే వారం రోజుల్లో కంప్యూటరైజ్ చేసి న్యాయమైన సమస్యలన్నింటిని ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం పేదల సంక్షేమానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్‌పీజీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.

ఉగాది నుంచి సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నామని, సంవత్సరంలోపే 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎకరాకు రూ.12వేలు రైతుభరోసా పెంచామని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోటు జమ చేశామని వివరించారు. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని పేర్కొన్నారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పట్టించుకోలే..

నల్గొండ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీని చేపట్టలేదని, ప్రజలు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. భద్రాచలంలోని రాములవారి గుడికి వంద కోట్లు ఇస్తామని గత ప్రభుత్వం 100 పైసలు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం 85 నుంచి 90 కోట్ల రూపాయలు ఇచ్చిందని వెల్లడించారు.

నకిరేకల్ ఎమ్మెల్యే కోరిన విధంగా వారం రోజుల్లో రామన్నపేట, నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయాలకు భవనా లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. ధరణి స్థానంలో భూభారతి తెచ్చిన ఘనత ప్రభుత్వానిదని కొనియాడారు.

స మావేశానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షత వహించగా.. కలెక్టర్ ఇలా త్రిపాటి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, ఎ మ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, మండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ పాల్గొన్నారు.