65 లక్షల ఓటర్ల జాబితా విడుదల
19-08-2025 12:22 AM
- జాబితా విడుదల చేయాలని ఈసీని ఆదేశించిన సుప్రీం కోర్టు
- వెబ్‌సైట్‌లో జాబితాను ప్రచురించిన ఈసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 18: బీహార్ ముసాయి దా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఈసీ ఆ జాబితాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రద ర్శించింది. ఈసీ విడుదల చేసిన జాబితాలో ఓటరు లిస్టు నుంచి తొలగించిన వారి పేర్లు, ఫొటోలు ఉన్నాయి. బీహార్‌లో ప్రత్యేక సమ గ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా ఎన్నికల సం ఘం ముసాయిదా ఓటర్ల జాబి తా నుంచి 65 లక్షల మందిని తొలగించింది. ప్రస్తుతం ఇదే జాబితాను ఈసీ ప్రచురించింది.






