calender_icon.png 19 August, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యా యుద్ధం ముగియనుంది!

19-08-2025 12:25:28 AM

  1. కాల్పుల విరమణ కాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసమే ప్రయత్నం
  2. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  3. ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ
  4. త్రైపాక్షిక సమావేశమే మార్గం 

వాషింగ్టన్, ఆగస్టు 18: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ సోమవారం అమెరికాలోని వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. సమావేశం ముగి సిన అనంతరం మీడియా సమావేశంలో ఇరు దేశాల అధినేతలు మాట్లాడారు. ‘కాల్పుల విరమణ కాదు. యుద్ధం ముగింపు కోసమే మా ప్రయత్నం. శాంతి కోసం ఉక్రెయిన్‌తో కలిసి పని చేస్తాం. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నాలు చేస్తాం. యుద్ధంతో ప్రపంచం అలసిపోయింది.

యుద్ధం ముగించేందుకు త్రైపాక్షిక సమావేశమే మార్గం’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘మూడున్నర సంవత్సరాల యుద్ధాన్ని ముగించేలా ప్రయత్నాలు చేస్తున్నందుకు ట్రంప్‌కు ధన్యవా దాలు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు ఎంతో బాధపడ్డారు’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి సమావేశంలో ట్రంప్-జెలెన్‌స్కీ నడు మ గొడవ జరగ్గా.. ఈ సమావేశం మాత్రం ప్రశాంతంగా ముగిసింది.