24-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (విజయక్రాంతి): ఆమె అంతే... ఆమె పేరే వసూళ్ల రా ణి... సూపర్వైజర్ల, అంగన్వాడి టీచర్ల మధ్యవర్తిత్వంతో అక్రమ వసూళ్లకు పెట్టింది పేరు. ఉద్యోగాల పేరుతో, పథకాల్లో కమిషన్, నెల నెల వాటా ఇలా అనేక విదాలుగా అక్రమం గా వసూలు చేయడం లోనూ దిట్ట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఐసిడిఎస్ సిడిపిఓ మంగతాయారు వ్యవహారం ఇది.
స్వయంగా ఆమె పరిధిలో పనిచేసే ఓ అంగన్వాడీ టీచర్ జిల్లా కలెక్టర్ కు స్వయంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారంటే ఆమె వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నా యో ఇట్టే చెప్పవచ్చు. గత ఏడాది ఉద్యోగం పేరుతో గుండాల మండలం కోనేరు గూడెం అంగన్వాడీ కేంద్రం లో రూ 1.50 వసూలు చేసిన వైనాన్ని విజయ క్రాంతి ఆనాడే వెలుగులోకి తెచ్చింది. ఆ వసూళ్లలోనూ మండ లంలో పనిచేస్తున్న ఇద్దరు అంగనవాడే టీచ ర్ల ప్రధాన పాత్రధారులు.
విషయం వెలుగులోకి రావడంతో తీసుకున్న పైకం గుట్టు చప్పుడు కాకుం డా చెల్లించి, వి చారణ అధికారులకు అడిగినంత ముడుపులు ఇచ్చి కేసు మాఫీ చేయించిన గట్టికురాలు. ఇంత జరిగిన మార్పు రాలేదు. తాజాగా టేకులపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్ల నుంచి రూ 7.98 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
బాధితులు స్వయంగా జిల్లా కలెక్టర్ కె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారంటే ఆమె వేధింపులు ఎలా ఉన్నాయో తేటతెల్లమవుతుంది. టేకులపల్లి మండలం కు చెంది న కుంజా భద్రమ్మ అనే అంగన్వాడి టీచర్ ఐసిడిఎస్ సిడిపిఓ సూపర్వైజర్ కే అనురాధ ద్వారా అక్రమ వసూళ్లకు పా ల్పడుతుందని ఫిర్యాదు చే యడం గమనార్హం.
కేంద్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న పోష న్ అభియాన్ 2 ద్వారా ఈ ఏడా ది మార్చి నెలలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ 6 వేల రూపాయలు, అంగన్వాడీ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించినం దుకు మరో రూ 6 వేలు అంగన్వాడీ టీచర్ల వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు. జమ అయి న రూ 12 వేలల్లో ప్రతి ఒక్కరి నుంచి 2 వేలు బలవంతంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మండల వ్యాప్తంగా 22 8 కేంద్రాల నుంచి మొత్తం రూ 4.56 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. 2023 సంవత్సరం నుంచి ప్రతి అంగన్వాడి కేంద్రం రూ 500 చొప్పున రూ 1.14 లక్షలు, 2024 సంవత్సరంలో రూ 1000 చొప్పున రూ 2.28 వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా పాఠశాలకు అనుబంధంగా ఉన్న అంగనవాడి కేంద్రాలకు విద్యుత్ సౌక ర్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈనెల 12వ తేదీన ప్రతి అంగన్వాడీ టీచర్ వ్యక్తిగత ఖాతాలో రూ 7, 16 5 మొదటి విడతగా జ మ చేశారని, ఆ డబ్బులకు అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి సంబంధం లేదని బెదిరించి వాటిని సిడిపిఓ, సూపర్వైజర్ ద్వారా తిరిగి ఫోన్ పే ద్వారా వసూలు చేసినట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే జిల్లాలోని ఐసిడిఎస్ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమా వెలుగు చూసిన ఉన్నతాధి కారుల చర్యలు శూన్యం. అంతేకాదు మంత్రి సీతక్క పేరు చె ప్పి ఐసిడిఎస్ ఉన్నతాధికారులు సైతం వస్తువులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా జిల్లా లో లేకపోలేదు.
ఇప్పటికైనా మాత శిశు సం క్షేమ శాఖ కమిషనర్, మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసిడిఎస్ అక్రమాలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.