calender_icon.png 24 May, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు కాలువ పనులపై ప్రభుత్వం విచారణ జరపాలి

24-05-2025 08:18:38 AM

పాత డిజైన్ ప్రకారమే సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం చెపట్టాలి.

డిస్ట్రిబ్యూటర్ కాలువలు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలి.

సీతారామ ప్రాజెక్ట్ కాలువ పనులు పూర్తి కాకుండానే ఏలా ప్రారంభిస్తారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ముగ్గురు మంత్రులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సూటి ప్రశ్న.

ములకలపల్లి,(విజయ క్రాంతి): సీతారామ ప్రాజెక్టు కాలువ నాసిరకంగా నాణ్యత లేని కట్టడాల పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల  పరిధిలోని మాధరం-పూసుగూడెం అడివి ప్రాంతంలో పాస్ వే పిల్లర్ కూలిన ఘటన స్థలాన్ని సిపిఎం బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు  సీతారామ ప్రాజెక్టు కాలువ కట్టడాలు డొల్లతనం తో నిర్మణ కట్టడాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాకుండా మండల పరిధిలోని వి.కె రామవరం లో ఉన్న పంప్ హౌస్  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఏట్లా ప్రారంభోత్సవం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

సీతారామ కాలువ తవ్వి బయట పోసిన మట్టి మీద సరైన బెస్ లేని మట్టి మీద పాస్ వే పిల్లర్లు కూలిపోయి కాలువ ప్రవాహానికి ఆటంకం అలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్లాన్ లో 3 రిజర్వాయర్లు ను ఏర్పాటు చేయాలని ప్లాన్ ఉన్నప్పటికీ దాని  ప్లాన్ మార్చి ఇప్పుడు పంప్ హౌస్ ద్వారా నడిపించాలని సూస్తున్నారని , మొదటి ప్లాన్ ప్రకారం రిజర్వాయర్ల ను వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. పంప్ హౌస్ దగ్గర కూడా అనేక చోట్ల క్రాక్ లు వచ్చాయని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువ ఆయకట్టు 6.75 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందించాలని డిజైన్ లో ఉందని ఉమ్మడి ‌జిల్లా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా రైతాంగానికి సాగునీరు సస్యశ్యామలంగా అందిస్తామని పెద్ద ప్రకటనలు చేస్తూ జిల్లా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

వేల క్యూసెక్కుల నీటిని కాలువలో వదిలితే కాలువ కింద ఉన్న గ్రామాలు, సాగు భూములు నీటి ప్రవాహనికి  నాణ్యత లేని కాలువ కట్టడాల కారణంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ కాలువ నిర్మాణం సూమారు 1000 కిలోమీటర్ల దూరం ఉందని మొట్టమొదటి డిజైన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి భద్రాద్రి జిల్లా రైతాంగానికి డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా సాగునీరు అందించాని డిజైన్ లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ మార్చి భద్రాద్రి జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తుందని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో వెంటనే రిజర్వాయర్ల ను నిర్మించి భద్రాద్రి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ లోని లోపాలను సరి చేయాకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మాచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ,రైతు సంఘం జిల్లా నాయకులు కొండబోయిన వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పాల్వంచ సిపిఎం మండల కార్యదర్శి పాకాల వెంకట్రావు, వూకంటి రవికుమార్, నిమ్మల మధు,గొగ్గల ఆదినారాయణ,కుంజా రాంమూర్తి, బైరు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు