24-05-2025 02:08:46 AM
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి :
ఏదేమైనా కవితకు కేసీఆర్‌కు మధ్య మరి అంత తీవ్రస్థాయిల్లో వైరుధ్యాలు ఉండకపోవచ్చని, కేసీఆర్ ఎప్పటికీ కవితను వదులుకోడు.. అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరు ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తారనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఆసక్తికర పరిణామా లు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం మాటల దాడులు చేసుకుంటున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మె ల్సీ కవిత తన తండ్రికి లేఖాస్త్రాన్ని సంధించారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. తండ్రీ తనయల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది.. అసలు బీఆర్‌ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు నిగ్గు తేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టి స్ పీసీ ఘోష్ కమిటీ ఇప్పటికే 400 పేజీ ల తుది నివేదిక సిద్ధం చేసిందని, మరికొ న్ని రోజుల్లో ప్రభుత్వానికి ఆ నివేదిక అం దుతుందనే ప్రచారం కొద్దిరోజుల క్రితం జరిగింది.
నాటి సీఎం కేసీఆర్, నాటి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావును బహిరంగ విచారణ చేస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే కారణంతోనే కమిషన్ కాస్త వెన క్కి తగ్గిందనే వార్తలు వినవచ్చాయి. కానీ అనూహ్యంగా కమిటీ కొత్త నిర్ణయం తీసుకున్నది. తాజాగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చింది. నోటీసుల ప్రకారం ముగ్గురూ వచ్చేనెల మొదటి వారంలో వేర్వేరుగా విచారణకు హాజరుకావాల్సి ఉన్నది.
కాళేశ్వరం కథాకమామీషు ఏంటి..
తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న నినాదంతో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది. అందకు సుమారు లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ప్రాజెక్ట్‌ను హడావుడిగా నిర్మించిందనే అభిప్రాయాలు నిర్మాణ దశ లో ఉన్నప్పుడే వ్యక్తమయ్యాయి. కేసీఆర్‌కు ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్ట్ నిర్మించారని, ఆయన అభీష్టం మేరకే నిర్మాణ పనులు జరిగాయని ఇటీవల కొందరు ఇంజినీర్లు పీసీ ఘోష్ కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ విధానంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నట్లు ఇతర రాజకీయ పార్టీలు నాడు గగ్గోలు పెట్టాయి. లక్ష కోట్ల ప్రజాధ నం బూడిదలో పోసిన పన్నీరైందని నాటి అధికార పార్టీపై దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వా త కొద్దిరోజులకే కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బరాజ్ కుంగడం, రెండు పిల్లర్లు స్వల్పం గా ధ్వంసం కావడమూ జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెసోళ్లే బరాజ్‌కు బాంబులు పెట్టి ధ్వంసం చేశారన్న అర్థంలో మాట్లాడా రు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సుప్రీం కోర్టు జస్టిస్‌లే మెచ్చుకున్నారని, అధికార పార్టీకి మా త్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
రెండు పిల్లర్లు స్వల్పంగా ధ్వంసమైతే ఇంత రాద్ధాంతం అవసరమా అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా తామేమీ తక్కువ తిన్నలేమన్నట్లు.. బీఆర్‌ఎస్ నేతలపై దీటైన దాడికే దిగుతున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు కేసీఆర్ బహిరంగ విచారణకు హాజరుకాకపోవచ్చనే అభిప్రాయం కొందరి నుంచి వస్తున్నది.
కవిత లేఖ కలకలం..
బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభకు పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై ఆయన తనయ, ఎమ్మెల్సీ కవిత లేఖ రాసినట్లు ప్రధాన మీడియా స్రవంతి లో తాజాగా విస్తృతమైన కథనాలు ప్రసారమయ్యాయి. లేఖలో పాజిటివ్‌గా కొన్ని అంశాలు, నెగిటివ్‌గా కొన్ని అంశాలు వీడదీసి ఉన్నాయి.
టీవీ చానళ్లు ఆ లేఖ ఫొటోలను సైతం ప్రముఖంగా చూపించాయి. ఒకవేళ ఆమె ఉత్తరం రాసినట్లయితే .. ఈ రోజుల్లో ఉత్తరం రాయాల్సి ఉందా? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో తనకు సరైన స్థానం లే దని, కేసీఆర్ వారసుడిగా కేటీఆర్‌కు మాత్ర మే అధికారం దక్కే అవకాశం ఉండటంతోనే కవిత అసహనంగా ఉన్నారనే ప్రచారమూ జరగుతున్నది.
కవిత లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఆమె నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నా రు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిల మధ్య వచ్చిన గ్యాప్ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిల మధ్య జరిగిన కోల్డ్‌వార్, మళ్లీ తెలంగాణలోనూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సమయంలో షర్మిల రాజకీయాలకు కాస్త ఉండటం కనిపించింది. జగన్‌మోహన్‌రెడ్డి కావాలనే షర్మిలను దూరంగా ఉంచారనే నాడు కొంతమేరకు ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి సోదరుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాదయాత్ర లు నిర్వహించారు. తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి చేతులెత్తేశారు. చివరికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తెలం గాణలోనూ కవిత కూడా తన ఉనికిని కాపాడుకునేందుకు అలాంటే ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తున్నది.
లిక్కర్ స్కాం కేసు లో ఐదు నెలల పాటు జైలులో ఉన్న కవిత, బెయిల్‌పై బయటకు విడుదలైన తర్వాత ఆమె కొద్దిరోజులు నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత బీసీ రిజర్వేషన్ల సాధన డిమాండ్‌ను భుజానికి ఎత్తుకున్నారు. బీసీల కోసం తాను ఏ పోరాటం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. తన సొంత సంస్థ అయిన ‘జాగృ తి’పై దృష్టిసారించారు. మున్ముందు జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతానని ప్రకటించడం కనిపించింది.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ మొదలు..
పార్టీ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖలో గత నెలలో వరంగల్ సమీపంలో ని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ గురించి ప్రస్తావించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బహిరంగ సభలో బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడలేదని, కేవలం రెండు నిమిషాలు మాత్రమే వాఖ్యలు చేసి చేతులు దులుపుకొన్నారని లేఖలో రాసి ఉన్నది. కాంగ్రెస్ పాలనపై కావాల్సిన మోతాదు కంటే తక్కు వ మోతాదులో వ్యాఖ్యలు చేశారని లేఖ లో రాసి ఉందనేది మీడియా కథనాల్లో బయటపడింది.
పార్టీలో పాతవారికి ప్రాధాన్య లేదని, కొందరికే ప్రాధాన్యం ఉందని లేఖలో రాసుకొచ్చారు. ఏదేమైనా కవితకు కేసీఆర్‌కు మధ్య మరి అంత తీవ్రస్థాయిలలో వైరుధ్యాలు ఉండకపోవచ్చని, కేసీఆర్ ఎప్పటికీ కవితను వదులుకోడు.. అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొందరు కవిత ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే ఇలాంటి రాజకీయాలు చేస్తారనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయ్.. అనైతే తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నది. కొందరైతే ఒకఅడుగు ముందు కువేసి.. డైవర్షన్ రాజకీయాలు సాగుతు న్నాయని కూడా అంటున్నారు. ఇదందా ఒకవైపు అయితే.. మరోవైపు కాళేశ్వరం విచారణ, ఎవరిది తప్పు? ఎవరిది రైటు? అనే చర్చకంటే ముందు ప్రాజె క్ట్ పరిధిలో మరమ్మతులు చేపట్టడం ము ఖ్యమనే అభిప్రాయం కొన్నివర్గాల నుంచి వస్తున్నది.
రాజకీయపరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే రైతులకు మేలు చేసే విషయంపైనే అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష, విపక్ష పార్టీలైనా దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ప్రజాసం క్షేమం కోసం నిబద్ధతతో పనిచేయకుండా, ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై ప్రజానీకం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. తమ బాగోగులు చూడాలంటున్నది. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నది.
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి