18 April, 2026 | 11:01 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి

23-05-2025 11:39 PM

-కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్ (చెన్నూర్), మే 23: అకాల వర్షా ల దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం ముదికుంట, షెట్ పల్లి, కిష్టంపేట, కుందారం, వేలాల గ్రామాల్లో ఏర్పాటు చేసి న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మం డల తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకా రం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో నెలకొన్న అకాల వర్షాల దృష్ట్యా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. సన్న రకం వడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.