23-05-2025 11:38:22 PM
దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు
మహదేవపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సరస్వతీ నది పుష్కరాలలో భాగంగా శుక్రవారం 9వ రోజున 3 లక్షల పైకి వచ్చిన భక్తులు, కిటకిటలాడిన సరస్వతీ పుష్కర ఘాటు, శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ ఎక్కువ కనిపించినది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలేశ్వరం లో పార్కింగ్ స్థలాలు తడిసి ముద్దవుడవతో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు, అధికారులు కాలేశ్వరం వచ్చే భక్తుల వాహనాలను వన్ వే ట్రాఫిక్ గా మార్చి వేయడంతో పూసుకుపల్లి వద్ద నుండి సరస్వతి ఘాట్ వరకు నాలుగు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో బస్సులు దిగి తమ వాహనాలు దిగి నడుచుకుంటూ సరస్వతి ఘాట్ వరకు వెళ్ళినారు. వాహనాలను నిలుపుటకు పార్కింగ్ స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు కూడా వర్షం ఉదృతంగా ఉండడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ మరియు కలెక్టర్ ఇద్దరు ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులకు ఇబ్బందుల రాకుండా సమన్వయం చేస్తూ, వాహనాలు దిగబడిన చోట కంకర చిప్స్ వేయడం జరుగుతుందని, ఈ ఈరోజు 3 లక్షల పైకి భక్తులు రావడంతో ట్రాఫిక్ లోనే ఐదు నుండి ఆరు గంటలు చిక్కుకోవడం జరిగిందని, ఆ ట్రాఫిక్ ప్రాంతమంతా అటవీ ప్రాంతం అవడంతో నీళ్లు కూడా లభించలేదని భక్తులు ఆరోపించారు, ఈ విధంగా పుష్కరాలకు వచ్చే భక్తులను అంచన వేయడంలో అధికారులు విఫలం చెందారని, ఈ ట్రాఫిక్ లోనే పలుగుల మరియు సండ్రుపల్లి మూల వద్ద గ్రామపంచాయతీ పేరుతో ప్రైవేట్ వాహనాలకు వంద రూపాయల చొప్పున చిట్టి వసూలు చేసినారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసినారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ డి పి ఓ ఆదేశాలు ఇచ్చి చిట్టి వసూళ్లు వేయాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులు.