15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రైస్తవ స్మశాన వాటికకు భూమి కేటాయింపు..

02-06-2025 06:23 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ లో జరిగిన వరంగల్ పశ్చిమ క్రైస్తవ సమాజం ఏర్పాటు చేసిన కృతజ్ఞత అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య(MP Dr. Kadiyam Kavya), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు(MLA K.R. Nagarajuపాల్గొన్నారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో నిత్యం ప్రజల సమస్యల పరిష్కారినికి పాటు పడుతున్నాం, క్రైస్తవ సోదరుల సహాయక, సహకారాలతో గెలిచిన 16 నెలల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన మన త్రినగరిలో అన్ని కులాలకు, మతాలకు సమానంగా అభివృద్ధి చేస్తాం. సమిష్టి కృషి ఫలితమే క్రైస్తవ స్మశాన వాటికకు 3 ఎకరాల భూమిని మడికొండలో కేటాయించడం జరిగిందని, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వం అందజేసిన మూడెకరాల భూమి జీవో కాపీని చర్చి పెద్దలకు, సంఘ కాపరులకు అందజేశారు. అనంతరం చర్చ్ పెద్దలు, సంఘ కాపరులు ఎంపీ, ఎమ్మెల్యేలను పూలమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, పెరుమండ్ల రామ కృష్ణ, బోడ డిన్న, అనిల్ కుమార్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.