20-08-2025 12:41:35 AM
ఎమ్మెల్యే హరీష్ బాబు
కాగజ్‌నగర్, ఆగస్టు ౧౯ (విజయక్రాంతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49 పూర్తిగా రద్దు చేయడంతో పాటు పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. తన నివాసంలో చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 తాత్కాలిక నిలుపుదల చేసి ప్రాంత రైతులను మోసం చేసిందన్నా రు.
నియోజకవర్గంలో పోడు రైతుల సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటి పరిష్కా రం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పట్టింపు లేనితనంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆయన దీక్షకు మద్దతుగా పద్మశాలి సంఘం నాయకులు, బిజెపి నాయకులు పోడు రైతులు సంఘీభావం తెలిపారు. అలాగే ఎమ్మెల్యే హరీష్‌కు వైద్యు లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.