20-08-2025 12:40:24 AM
గద్వాలరూరల్, ఆగస్టు 19;గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ పరశురాముడు స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని సమేత శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవము సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్బం గా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం ను నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. జమ్ములమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తమ మొక్కలను తీర్చుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఈ జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకుని విచ్చేస్తుంటారు.
వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భవిష్యత్తులో జమ్ములమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రంగా ఏర్పడే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సు భాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఆలయం కమిటీ డైరెక్టర్స్, నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.