calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టుల వినతి

20-08-2025 12:43:00 AM

నిర్మల్, ఆగస్టు (విజయక్రాంతి): నిర్మ ల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీ నేత మహేశ్వ ర్ రెడ్డి,  కలెక్టర్ అభిలాష అభినవ్‌కు మంగళవారం రోజు వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా కోరారు.

దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఈ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ విషయంపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.