12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం

18-06-2025 12:00 AM

ఇంద్రవెల్లి మండల పర్యటనలో కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, జూన్ 17 (విజయక్రాంతి):  దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు ఎంత గానో ఉపయోగపడతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి, రెవెన్యూ సదస్సులను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దస్నాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యు సదస్సును వైద్య శిబిరాన్ని పరిశీలిం చి, సదస్సుకు వచ్చిన రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పిట్టబొంగరం గ్రామంలో  అమర వీరులకు, ఇతర లబ్ధిదారులకు కేటాయించి న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు పరిష్కారంతో పాటు ప్రజలు అందించే గ్యా స్ సిలిండర్, రేషన్ కార్డ్, ఇతరత్రా సర్టిఫికెట్ల దరఖాస్తులను సైతం స్వీకరించడం జరుగుతుందన్నారు. కాస్తులో ఉన్నవారికి భూమి పట్టాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకుంటే పట్టాలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్ పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.