25 March, 2026 | 3:55 AM

మిలిటరీ క్యాంప్‌పై విరిగిపడ్డ కొండచరియలు

03-06-2025 12:00 AM

- ఈశాన్య భారత్‌లో రెడ్ అలర్డ్

న్యూఢిల్లీ, జూన్ 2: ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలోని ఛటేన్ అనే ప్రాంతంలో మిలిటర్ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడగా ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 6గురి ఆచూకీ గల్లంతైంది.

ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా, సోమవారం ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈశాన్య భారత్ లోని రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్‌అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, పిడుగుల పడొ చ్చని హెచ్చరించింది.

అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో అతిభారీ వర్షా లు పడొచ్చని వెల్లడించింది.  ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు తొందరగా రావడం, బంగ్లాదేశ్, మేఘాలయపై అల్పపీడనం ఏర్ప టం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆదివారం అస్సాంలో 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి.