calender_icon.png 13 July, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంగర్ హౌస్ అమ్మవారి ఘటం ఊరేగింపు

13-07-2025 12:32:19 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): లంగర్ హౌస్ అమ్మవారి ఘటాన్ని శనివారం ఘనంగా ఊరేగించారు. లంగర్ హౌస్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రధాన దేవాలయం బుజిలి మహం కాళి ఆలయం నుంచి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘటం ఊరేగిం పు ప్రారంభించారు. డిఫెన్స్ కాలనీ, మందు ల బస్తీ, బాపునగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ అమ్మవారి ఘటాన్ని డప్పు వాయిద్యాలతో ఊరేగించారు.

బాపునగర్‌లోని గడ్డి కరణ ప టేల్ గృహంలో అమ్మవారి ఘటానికి పూ జలు జరిపి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ ఊరేగింపులో కమిటీ స భ్యులు, చైర్మన్ గడ్డి చంద్రశేఖర్, కన్వీనర్ ఆ కుల అభిషేక్, ప్రదీప్‌గౌడ్ కోశాధికారి పర్మిశె ట్టి, వెంకటేష్, శ్రీకాంత్ యాదవ్, నాయకు లు దామోదర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాగప్రకాష్‌రెడ్డి, పూర్ణచంద్రరావు, ఆలేటి రాకేష్, గ డ్డి చందు, విజయ, అజయ్ పాల్గొన్నారు.