పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి
22-07-2026 01:29 AM
ఎంపీడీవో రమాదేవి
ఇటిక్యాల, జూలై 21: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో రమాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం సర్పంచ్ జీవేందర్ రెడ్డితో కలిసి ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






