ఈత వనం నాటడంతో కులవృత్తి ఎంతో ఉపయోగం
- పర్యావరణంతో భావితరాలకు మేలు
- జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుందా రెడ్డి
కామారెడ్డి, జులై 21 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈతవనాలను నాటారు. ఈత వనాలు పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధికి ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ అరుణ్ చంద్ర, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ భీమయ్య ల లక్ష్మి రాజు, ఉప సర్పంచ్ లక్ష్మి నారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మగోని రాజా గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు ధర్మగొని కిషన్ గౌడ్, సంఘం ప్రతినిధులు రాజేందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






