22 July, 2026 | 1:59 AM

ప్రజాస్వామ్య బలోపేతంలో బీఎల్‌ఏల పాత్ర కీలకం

22-07-2026 01:28 AM

అయిజ, జూలై 21: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉత్తనూర్ జయన్న అన్నారు. మంగళవారం అయిజలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించి మార్పులు, చేర్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడంలో బీఎల్‌ఏలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.