11 August, 2026 | 1:34 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

లట్టుపల్లిని గిరిజన మండలంగా ప్రకటించాలి

20-06-2025 02:13 PM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) బిజినపల్లి మండలంలోని ఉమ్మడి లట్టుపల్లి గ్రామాన్ని గిరిజన మండల కేంద్రంగా ప్రకటించాలంటూ గ్రామస్థులు, గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. లట్టుపల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, వివిధ పార్టీల నేతలు, గిరిజన తండాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లట్టుపల్లిని గిరిజన మండల కేంద్రంగా ప్రకటించాలన్న వినతిపత్రాన్ని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. మండలంలో గిరిజనుల సంఖ్య అధికంగా ఉండటం, ప్రత్యేకంగా 18 గిరిజన తండాలు లట్టుపల్లి పరిధిలో ఉండటం వలన, ఈ ప్రాంతాన్ని గిరిజన మండలంగా గుర్తించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.