రేషన్ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి
రేషన్ పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి.
- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రేషన్ పంపిణీ నిబంధనల మేరకు 100 శాతం సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badavath Santosh) రేషన్ డీలర్లను ఆదేశించారు. శుక్రవారం బిజినపల్లి మండలం(Bijinapalle Mandal) వెలుగొండ గ్రామంలోని రేషన్ షాప్‌ను సందర్శించి సన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నాణ్యతతో కూడిన సన్న బియ్యం పంపిణీ చేస్తుందని లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి ఎవరు కూడా బియ్యం అక్రమార్కులకు అమ్ముకోవద్దన్నారు. ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 65.69% పంపిణీ పూర్తైందని, 1.6 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం అందించామన్నారు. ఈ నెల 30 వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుందనీ, ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.






