14-07-2025 01:38:47 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): శ్రీగణేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో లయన్స్ క్లబ్ సౌజన్యంతో బోయిన్‌పల్లి పెన్షన్ లైన్‌లో ఇటీవల కంటి పరీక్షలు చేయించిన వారిలో అవసరమైన 153 మం దికి ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ కొడుకు, శ్రీగణేశ్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఆధ్వర్యంలో కళ్లజోళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ముకుల్ మాట్లాడు తూ సమాజ సేవతోనే సంతృప్తి వస్తుందని, మా నాన్నగారు చెప్పిన బాటలోనే పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకు న్నానని చెప్పారు.
శ్రీగణేశ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇటీవల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి కంటి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వారిలో అవసరమైన వారికి ఈ రోజు కళ్ల జోళ్లు పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. అవసరమైన వారికి ఇటీవల కొంతమందికి కండ్ల ఆపరేషన్ చేయించామని, మిగతా వారికి కూడా ఆపరేషన్ అవసరమైతే చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని, శ్రీగణేశ్ ఫౌండేషన్‌కు సహకరిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, బంగారు సదానంద్, గుడ్డు తదితరులు పాల్గొన్నారు.