15 August, 2026 | 1:44 AM

జెనెసిస్ ఇన్నోవేషన్ ఫెస్టివల్ ఆవిష్కరణ

15-08-2026 01:18 AM

ఆరిజిన్స్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ 

హైదరాబాద్, ఆగస్టు 14(విజయక్రాంతి): ఆరిజిన్స్ ఇండియా తన ప్రతిష్ఠాత్మక జెనెసిస్ ఇన్నోవేష న్ ఫెస్టివల్‌ను  ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐఐటీహెచ్)లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ (సీఐఈ)లో శుక్రవారం అధికారికంగా ఆవిష్కరించింది. ఆవిష్కరణ, వ్యాపారా రం భం, సాంకేతికత, ఉపాధి అవకాశాలు, కళలు, సం స్కృతి, భాగస్వామ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆరిజిన్స్ ఇండియా లక్ష్యంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

జెనెసిస్ ఇన్నోవేషన్ ఫెస్టివల్‌ను తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫా ర్మా సంస్థ సీఈఓ సర్వేష్ సింగ్, టీజీఐసీ   సీఈఓ మీరాజ్ ఫహీమ్   ప్రారంభించారు.   జెనెసిస్ ఇన్నోవేషన్ ఫెస్టివల్ అనేది ఆరిజిన్స్ ఇం డియా ప్రధాన కార్యక్రమం. దీనిని ఆదిత్య వల్లాలా స్థాపించగా, అచ్యుత్ రెడ్డి, నిఖిలా రవిపతి సహ వ్యవస్థాపకులుగా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.