కుల వివక్షకు బీజేపీ పరాకాష్ట..
15-08-2026 01:17 AM
ఖర్గే ప్రసంగ వేదిక శుద్ధి దళితులను అవమానించడమే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, ఆగస్ట్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన సభా వేదికను శుద్ధీకరణ పేరు తో హవనం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ ఘటన కుల వివక్షకు, సామాజిక విభజనకు నిదర్శనమన్నారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రాంలీలా మైదానంలో కాంగ్రె స్ నిర్వహించిన విజయ్ శంఖనాద్ సభలో ఖర్గే ప్రసంగించగా శ్రీరామ్ సే న కార్యకర్తలు అదే వేదిక వద్ద శుద్ధీకరణ హవనం నిర్వహించడం తీవ్రంగా అభ్యంతరకరమని శ్రీనివాస్ అన్నారు.






