13 April, 2026 | 12:44 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

గ్రామీణ వార్తలకు ప్రాణం పోసిన వ్యక్తి లక్ష్మణ్

12-01-2026 02:39 AM

జర్నలిజంలో చిరస్థాయిగా నిలిచిపోతారు

జర్నలిస్ట్ లక్ష్మణ్ సంస్కరణ సభలో వక్తలు

లక్ష్మణ్ పేరున గ్రామీణ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని వినతులు

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): మానవీయ కోణంలో వార్త రచనను కొనసాగించి గుండెలకు హత్తుకునే విధంగా వార్తలను మలచిన జర్నలిస్ట్ లక్ష్మణ్ తెలుగు జర్నలిజంలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు పూర్వ సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. గ్రామీణ వార్తలకు ప్రాణం పోసిన వ్యక్తిగా తెలుగు పత్రిక రచనలో గ్రామీణ లక్ష్మణ్ గా ఆయన చిరకాలం ఉండిపోతారని తెలిపారు. గ్రామీ ణ విలేకరులకు, రిపోర్టర్లకు ఏటా జర్నలిస్టు లక్ష్మణ్ పేరున అవార్డులు ఇవ్వాలని ఆ బాధ్యతను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తీసుకోవాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ సంస్కరణ సభ ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో సీనియర్ జర్నలిస్టు కె.రామ చంద్ర మూర్తి మాట్లాడుతూ.. గ్రామీణ జర్నలిస్టులకు, మఫిసెల్ డెస్క్ జర్నలిస్టులకు ప్రతి ఏడాది లక్ష్మణ్ పేరున అవార్డులు ఇవ్వాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ మాట్లాడుతూ.. లక్ష్మణ్‌కు మాట భూషణం అని, వార్తలను తీర్చిదిద్ది జన హృదయాల్లోకి తీసుకుపోయే నేర్పరి అని పేర్కొన్నారు. సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు జర్నలిజం చరిత్రలో లక్ష్మణ్ ఒక అధ్యాయం అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ.. లక్ష్మణ్ మానవీయ కోణంలో వార్తలు రాయడంలో దిట్ట అని తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. అన్యాయాలు జరిగితే తీవ్రంగా నిరసిస్తూ జర్నలిజంలో ఘాటైన బ్యానర్లు పెట్టే వారని చెప్పారు. కల్లూరి భాస్క రం మాట్లాడుతూ.. ఎంతోమంది జర్నలిస్టుల ఎదుగుదలకు లక్ష్మణ్ దోహదపడ్డారన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీ ణ జర్నలిస్టులకు అండగా నిలబడి వారి కోసం ఎడిట ర్లు యాజమాన్యాలతో మాట్లాడగలిగిన ఖ్యా తి లక్ష్మణ్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, జర్నలిస్టులు వసంత లక్ష్మి, సురేంద్ర రాజు, పిన్న కృష్ణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్, లక్ష్మణ్ సోదరుడు వేణు, శివాజీ, అమరయ్య, ధోర్భ ల శర్మ, కొండయ్య, కే సుబ్రహ్మణ్య శాస్త్రి, కె రామదాసు, రహిమాన్, బోడపాటి శ్రీనివాస్, అత్తలూరి అరుణ, సైదారెడ్డి, గం ధం బంగారు, తరనీ, ఎం సాగర్ కుమార్, ప్రొఫెసర్ ఏడుకొండలు ప్రసంగించారు.