calender_icon.png 12 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్ 65పై డ్రోన్‌లు

12-01-2026 02:40:11 AM

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పర్యవేక్షణ

చిట్యాల, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాల మండల పరిధిలో జాతీయ రహదారి 65 మీదుగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను డ్రోన్‌లతో పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఆదివారం నల్లగొండ ఎస్పీ  శరత్‌చంద్ర పవార్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి  పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్‌ను పక్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రాకపోకలు జరుగుతున్నాయి. ఆదివారం ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలు జరిగాయని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.