21-11-2025 11:41:37 PM
సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్
సిద్ధిపేట రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు పది రోజుల జైలు శిక్షణ విధించినట్లు రూరల్ ఎస్సై రాజేష్ తెలిపారు. గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ లో ఆయన ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉండగా, టెస్టులలో పట్టుబడ్డ ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో మద్యం తాగినట్టుగా రిపోర్టు రావడంతో, అతడిని కోర్టుకు తరలించగా, అక్కడ జడ్జి అతనికి పది రోజుల జైలు శిక్షను వేధించినట్లు ఎస్ఐ తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఎవరు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు.