22 April, 2026 | 7:12 PM

Breaking News

వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •   బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానం   •   గ్రామాల్లో ఇంటి పన్ను 100% వసూలు చేయాలి   •  

అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి

22-04-2026 06:03 PM

* 58వ డివిజన్ పరిధిలో 72 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 58వ డివిజన్ పరిధిలో రూ.72 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, రోడ్డు విస్తరణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహిత రాజులతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరమని, పనులను నిర్ణీత కడువులో పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు, అధికారులతో సమన్వయం చేసుకోవాలి.

ఇప్పటికే సుమారు  80 శాతం రోడ్డు పనులు పూర్తయ్యాయని, త్వరలో 100 శాతం అంతర్గత రోడ్లు, సిసి డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకొని ఏబీసీ కేటగిరీల ప్రకారం అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు 18 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ, జంక్షన్ల సుందరీ కరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, మెరుగైన మౌలిక సదుపాయాలకు, ఈ పనులు దోహదం చేస్తాయని అన్నారు.