calender_icon.png 10 September, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన నాయకులు

10-09-2025 01:53:51 PM

బిచ్కుంద, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ( Chakali Ilamma) వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, రజక సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ తెగువను, పోరాట పటిమను ప్రపంచానికి చాకలి ఐలమ్మను స్మరించుకుందామన్నారు. వారు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తిమంతులుగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్, గోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సాయిని బస్వరాజ్, కొండ్ర బాలకృష్ణ, నాగేష్, రాజు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.