calender_icon.png 10 September, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

10-09-2025 03:06:23 PM

డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి:  జీవనోపాధికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని, స్వయం ఉపాధి తోనూ రాణించవచ్చని  ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో సుంకరి లింగయ్య నూతనంగా ఏర్పాటు చేసుకున్న హెల్త్ ప్లస్ రక్తపరీక్ష కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడిపాటి సైదులు మాట్లాడుతూ... ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఆదిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సూచించారు.గ్రామీణ ప్రాంత యువతీయువకుల్లో సృజనాత్మకతకు కొదువలేదని తెలిపారు. స్వయం ఉపాధి రంగంలో ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక పథకాలు, రాయితీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీల సంఘం మండల అధ్యక్షుడు పప్పుల వెంకన్న, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ఉపేందర్, కటకం సూరయ్య తదితరులు పాల్గొన్నారు.