calender_icon.png 10 September, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయుధ పోరాట స్పూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనం

10-09-2025 04:23:49 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ నిదర్శనమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి(Minister Komatireddy Venkata Reddy) పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్ లో గల రజక భవనం ఎదుట  చాకలి ఐలమ్మ విగ్రహానికి బుధవారం  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,సట్టు శంకర్, పలువురు రజక సంఘం నేతలు పాల్గొన్నారు.