10-09-2025 03:08:16 PM
అనంతగిరి వైద్యాధికారి పుష్పలత
అనంతగిరి, శుక్రవారం రోజున వెంకట్రాంపురం గ్రామంలో క్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ఎక్స్ రే క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు, పరిసర గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షయ అనుమానిత వ్యక్తులు ఈ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకునుటకు అవకాశం కలదు అన్నారు, మూడు వారాలకు మించి దగ్గు, మరియు బరువు తగ్గుట, కళ్ళేలో రక్తంపడుట, తరచూ రాత్రి పూట జ్వరం లాంటి అనుమానం ఉన్న వ్యక్తులు ఈ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకుని ఉచితంగా మందులు పొందే ఈ అవకాశాన్ని వెంకట్రాంపురం గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.