10-09-2025 01:51:38 PM
దేవరకొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 40వ వర్ధంతి వేడుకలను కొండమల్లేపల్లి చౌరస్తాలోని రజక సహకార సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మఅని, హక్కుల కోసం కొట్లాడే వారికి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని,ఐలమ్మ చరిత్ర నేటితరం మహిళలకు దిక్సూచి అని,ఆమెను గుర్తు చేస్తూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఊట్కూరి వేమన్ రెడ్డి, పీఏపల్లి మాజీ వైస్ ఎంపీపీఅర్వపల్లి సరిత నర్సింహా, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు రామావత్ లాలు నాయక్,మాజీ ఎంపీటీసీ జగన్,మాల్ మార్కెట్ డైరెక్టర్ కె. వెంకటేష్,అందుగులలింగయ్య,బిజెపి మండల అధ్యక్షుడు భూతరాజు భరత్ కుమార్ వరికుప్పల శ్రీను, వస్కుల శ్రీను,రజక సంఘం అధ్యక్షులు భూతరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.