calender_icon.png 10 September, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ

10-09-2025 03:04:54 PM

బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి...

బాన్సువాడ,(విజయక్రాంతి): తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మని(Chakali Ilamma ) బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల రంగారెడ్డి పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలోబుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళలోకానికి స్ఫూర్తి నిచ్చిన వీరవనిత శ్రీ చాకలి ఐలమ్మ అని అన్నారు ఈ దేశంలో ఉన్న మహిళలందరూ చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ కిసాన్ మర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి మాజీ అసెంబ్లీ కన్వీనర్ చిదుర సాయిలు దాకయ్య బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ గుడుగుట్ల అనిల్ రామకృష్ణ. బిజెపి నాయకులు కొండని గంగారం శంకర్ సాయి రెడ్డి, భూమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు