02-12-2025 10:14:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): సొన్ మండలం సంగంపేట్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మారి విలాస్ తో పాటు ముఖ్య నాయకులు కస్తూరి నారాయణ, ద్యావత్ శ్రీనివాస్, ద్యావత్ ప్రశాంత్, కస్తూరి శ్రీనివాస్, తాళ్ళ ప్రవీణ్, బంక మనికిరణ్, జొర్రిగ సంతోష్, బంక అన్వేష్, సంఘం గణేష్, సంగెం ప్రశాంత్ తో పాటు 30 మంది యువకులు, కార్యకర్తలు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, నాయకులు అంకం శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, భీమ్ రావు, ద్యావతి ప్రశాంత్ తో పాటు మండల గ్రామ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.