02-08-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 1: బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహు ల్ గాంధీ ఆరోపించారు. దీనిని నిరూపించేందుకు తమ వద్ద అణుబాంబు లాంటి ఆధా రాలున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అణుబాంబు పేలిన రోజు ఈసీకి దాక్కునే అవ కాశం కూడా ఉండదని వ్యాఖ్యానించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)ను పూర్తి చేసిన ఈసీ గురువారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఓటర్ల సవరణ జాబితాను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన రాహుల్ తాజా గా మరోసారి ఈసీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరిం త లోతుగా అధ్యయనం చేస్తే ఎన్నికల సం ఘం విషయం బయటపడింది. దీంతో ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరి పి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం.
ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశం కూడా ఉండదు. ఈసీ ఇదంతా ఎవరి కోసం చేస్తుం దో అందరికి తెలుసు. ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. బాధ్యులైన ఏ ఒక్కరిని మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కున్నా మేం కనిపెడతాం’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
రాహుల్ మాటలు పట్టించుకోం: ఈసీ
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల చోరీపై రాహుల్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమని తెలిపింది. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమని.. అవి బాధ్యతరాహిత్యంగా ఉన్నాయని పే ర్కొంది. పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని అధికారులకు ఈసీ సూచించింది.
రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితం: సంబిత్ పాత్రా
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉ న్నాయన్నారు. ‘మీరు ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తాము’ లేదా ‘ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతా ము’ అని చెప్పడం మానేసి ‘బాంబు పే లుస్తా’ అంటూ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన భాషను ఉపయోగించి అవమానిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవాళ్లమని.. ప్రతిపక్షం అణుబాంబు పేల్చినా, తాము రాజ్యాంగాన్ని కాపాడుతామని సంబిత్ పాత్రా పేర్కొన్నారు.
హోదాకు తగ్గట్టు వ్యవహరిస్తే మంచిది: కిరణ్ రిజిజు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేం ద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పం దించారు. రాహుల్.. భారత వ్యతిరేక భాషను ఉపయోగించి ఎన్నికల సం స్థను కించపరిచారని ఆరోపించారు. ఆయనేం చిన్న పిల్లాడు కాదని.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత హోదాకు తగ్గ ట్టు వ్యవహరిస్తే మంచిదని సూచించారు.
రాహుల్ ఉపయోగించిన భాష ను విపక్ష నాయకులే వ్యతిరేకిస్తున్నారని, దేశ ఆర్థిక పరిస్థితిని కేంద్రం డెడ్ ఎకానమీగా మార్చిందని ఎలా చెప్పగలరని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. అధికారులను బెదిరించడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు.
దేశానికి హాని కలిగించే ప్రమా దకర ఆట రాహుల్ ఆడుతున్నారని కిరణ్ రిజిజు వ్యాఖ్యానిం చారు. ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు కార్యకలా పాలను అడ్డుకోవడం వల్ల అంతిమం గా ఓడిపోయేది ప్రతిపక్ష ఎంపీలే అని రిజుజు తెలిపారు.