02-08-2025 12:00:00 AM
న్యూయార్క్, ఆగస్టు 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే భార త్ సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా ట్రంప్ 69 దేశాలపై అ ధిక సుంకాలను విధిస్తూ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశారు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతా నికి పెరిగిన సుంకాలు ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు అదనంగా పె నాల్టీ విధించిన సంగతి తెలిసిందే. సిరియాపై అత్యధికంగా 41 శాతం టారిఫ్ విధించిన ట్రంప్.. పాకిస్థాన్‌పై పది శాతం తగ్గించి ఆ దేశంపై 29 శాతం ఉన్న పన్నును 19 శాతానికి తగ్గించి వారికి ఊరట కల్పించారు.
జా బితాలో లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10 శాతం సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఈ నెల 1 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ సవరించిన టారిఫ్‌లు ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే భారత్, కెనడా దిగుమతు లపై విధించిన టారిఫ్‌లు మాత్రం ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఆయా దేశాలపై అమెరికా విధించిన సుంకాలు (శాతాల్లో)
భారత్-25, సిరియా-41, ఇండోనేషియా-19, ఇరాక్-35, ఇజ్రాయెల్-15, జపాన్-15, జోర్డాన్-15, కజకిస్థాన్-25, లావోస్-40, లెసోతో-15, లిబియా-30, లీచ్టెన్‌స్టెయిన్-15, మడగాస్కర్-15, మలా వి-15, మలేషియా-19, మారిషస్-15, మోల్డోవా-25, మయన్మార్-40, మొజాంబిక్-15, నమీబియా-15, నౌరు-15, న్యూజిలాండ్-15, నికరాగ్వా-18, నైజీరియా-15, మాసిడోనియా-15, నార్వే-15, పాకిస్థాన్-19, పపువా న్యూ గినియా-15, ఫిలిప్పీన్స్-19, సెర్బియా-35, దక్షిణాఫ్రికా-30, దక్షిణకొరియా-15, అఫ్గా నిస్థాన్-15, అల్జీరియా-30, అంగోలా-15, బంగ్లాదేశ్ -20, బొలీవియా-15, బోస్ని యా-30, హెర్జెగోవినా-30, బోట్సానా -15, బ్రెజిల్-10, బ్రూనై-25, కంబోడియా-19, కామెరూన్-15, చాడ్-15, కోస్టారికా-15, కోట్ డి ఐవోయిర్ -15, రిపబ్లిక్ ఆఫ్ కాంగో-15, ఈక్వెడార్-15, ఈక్వటోరియల్ గినియా-15, ఫాక్లాండ్ దీవులు-10, ఫిజి-15, ఘనా-15, గయా నా-15, ఐస్‌లాండ్--15, జపాన్- 15, జో ర్డాన్-15, కజకిస్థాన్-25, లావో స్-40 లెసోతో-15, తైవాన్-20, థాయ్‌లాండ్- 19, ట్రినిడాడ్ అండ్ టొబాగో-15, ట్యునీషియా-25, టర్కీ-15, ఉగాండా15, బ్రిట న్---10, వనాటు-15, వెనిజులా-15, వియ త్నాం-20, జాంబియా-15, జింబాబ్వే-15.