calender_icon.png 2 August, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరానికి చిల్లు పెట్టి నీళ్లు వాడుకోవడం లేదుగా?

02-08-2025 01:57:30 AM

  1. సముద్రంలో కలిసే జలాలు వాడుకుంటే తప్పేంటి?
  2. బనకచర్లలో అన్యాయ మెక్కడుందో చెప్పాలి
  3. తెలంగాణకు వచ్చిన నష్టం ఏమిటి?
  4. అన్ని అనుమతులతోనే కాళేశ్వరం కట్టారా?
  5.  ఏపీ మంత్రి నారా లోకేశ్

అమరావతి, ఆగస్టు 1: సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను తాము బనకచర్ల ప్రాజెక్ట్ కోసం వినియోగించుకోవడం లో తప్పేముందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. తెలంగాణను దాటేసి సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను వాడుకుంటే ఆ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిట ని సందేహం వ్యక్తం చేశారు. గురువారం ఆ యన ఏపీలోని ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించినప్పుడు తాము అభ్యంతరం వ్య క్తం చేయలేదని, ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నారా, కాళేశ్వరం ప్రాజెక్టును స్టడీ చేసే కట్టా రా అని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుపై అ నసవరంగా రాద్ధాంతం చేస్తూ ప్రాంతీయ వి ద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆరోపించారు.

‘తెలంగాణ నుంచి జలాలను ఎత్తిపోసి బనకచర్లకు వాడుకోవడం లేదు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లుపెట్టి తోడేయడం లేదుకదా’ అని నిలదీశారు. వరద జలాలపై అధ్యయ నం చేయలేదని ఎవరన్నారని, ఏటా ఎన్ని జ లాలు సముద్రంలో కలుస్తున్నాయో లెక్కలు లేవా అని ప్రశ్నించారు. ఒకవేళ ఏ ఏడాదైనా వరదలు రాకపోతే మిగులు జలాలను వా డుకోబోమన్నారు.

బనకచర్ల ప్రాజెక్టులో త ప్పెక్కడుందని ప్రశ్నించారు. ఎవరో కొందరు నిపుణులు అభ్యంతరాలు రేపుతున్నారని అనుకుంటే ప్రాజెక్టులు కట్టే పరిస్థితే ఉండదన్నారు. రాయలసీమకు నీళ్లివ్వగలిగేవాళ్లమే కాదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను ఎత్తిపోసి సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నామని లోకేశ్ చెప్పారు.