23 August, 2026 | 9:34 PM

27న సెలవు ఇవ్వండి

22-05-2024 01:45 AM

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. 

సీఈవో వికాస్‌రాజ్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వినతి 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికల రోజున ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉపఎన్నిక వర్కింగ్ డే రోజున జరుగుతుండటంతో పట్టభద్రులైన టీచర్లు, ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇబ్బందులు కలుగుతాయని, అందుకు ఈ నెల 27న వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని కోరినట్లు చెప్పారు.