యూ ట్యాక్స్ ఒక అబద్ధం
మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు అవాస్తవం
రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): సీఎం పదవీ కోసం తాను ఢిల్లీ కి డబ్బులు పంపుతున్నట్లుగా బీజేపీఎ ల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి ‘యూ ట్యా క్స్’ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గమని ఆయన మంగళవారం ఖండించారు. తాను ప్రస్తుతం కుటుంబంతో కలిసి దైవదర్శనానికి వేరే రాష్ట్రానికి వచ్చామని, బుధవారం సా యంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తామ ని తెలిపారు. మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలకు తగిన జవాబు ఇస్తామని మం త్రి పేర్కొన్నారు. కనీస అవగాహన లేకుండా మహేశ్వర్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, నిత్యం వార్తల్లో ఉండేందుకు అసత్య ఆరోపణ లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.






