calender_icon.png 16 July, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు న్యాయ సహాయ సేవలు మరింత విస్తృతం

16-07-2025 12:47:35 AM

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య 

సంగారెడ్డి, జూలై 15(విజయక్రాంతి): జిల్లా మహిళ సాధికారత, సఖి కేంద్రాల  ద్వారా బాధిత మహిళలకు న్యాయ సహాయ సేవలు మరింత విస్తృతం  చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్  మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అందుతున్న సేవలపై అవగాహన పెంచుతూ సౌండ్ లైబ్రరీ వంటి వినూత్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్ ద్వారా పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవల అమలును సమీక్షించారు. అలాగే, మిషన్ వాత్సల్య పథకం ద్వారా పిల్లలకు ఇవ్వబడే స్పాన్సర్షిప్స్, దత్తత, బాలసదనాలు, శిశురక్షణ కేంద్రాల నిర్వహణపై వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మిషన్ వాత్సల్య ద్వారా బాలల సంక్షేమం, దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో  పిల్లలకు ఆహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణపై నిరంతర పర్యవేక్షణ జరపాలని  పేర్కొన్నారు . దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అందుతున్న సేవలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓలు చంద్రకళ, జయరామ్, ప్రియాంక, అంజమ్మ, సుజాత, డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సౌమ్య, జిల్లా మహిళ సాధికారత కోఆర్డినేటర్ పల్లవి, సఖి కేంద్రం కోఆర్డినేటర్ కల్పన పాల్గొన్నారు.