16-07-2025 12:47:17 AM
బెజ్జూర్, జులై 15(విజయ క్రాంతి):మండలంలోని సోమిని గ్రామంలో 12 గిరిజన గ్రామాల ముఖ్యనాయకులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాకాలం వస్తే ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులకు గురివుతున్నారని అత్యవసర సమయంలో కూ డా మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఊరికి రోడ్లకి మరమ్మతులు చేసి ఆ ఊరి ఓట్లు అడగాలని లేదంటే తమ ఊర్లోకి నాయకు లు రావొద్దన్నారు.
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కుష్నపల్లి గ్రామం నుంచి సోమిని వరకు ఉన్న మట్టి రోడ్డు పూర్తిగా గుంతలు పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.విషయమై అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే,అధికారులకు విన్నవించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో సమస్యను మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దృష్టికి తీసుకువెళ్లగా ఈ సమస్యపై స్పందించి వెంటనే వారం రోజు ల్లో రోడ్డు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు.అనంతరం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు కల్వర్టులు, రహదారులు మంజూరు చేసి గిరిజన గ్రామ ల ఇబ్బందులు తీర్చాలని కోరారు.