calender_icon.png 26 August, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

26-08-2025 02:40:56 AM

కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఇండియా కూటమి విపక్షాల ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం గర్వకారణం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కే మురళీధర్‌రెడ్డి అన్నారు.

సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. దేశంలో అతికొద్ది మంది న్యాయ కోవిదుల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఒక్కరని, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలోని వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ఎన్నో కీలక తీర్పులు వెలువరించారని చెప్పారు.

తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం వలన  ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరు, పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూట మి ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి ఎం పికలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర ఉందని తెలిపారు. కాగా కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూ రాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మురళీధర్‌రెడ్డి సంతాపం తెలిపారు.