calender_icon.png 26 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్‌లో మానియా ది సెలూన్

26-08-2025 02:39:37 AM

ప్రారంభించిన జబర్దస్త్ వర్షా

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): మానియా ది సెలూన్ 79వ ఫ్రాంచైజీని నటి, జబర్దస్త్ వర్షా సోమవారం కొందాపూర్‌లోని రాఘవేంద్ర నగర్‌లో మానియా సెలూన్స్ కో ఫౌండర్ ఉదయ్‌కుమార్ కొనేరు, ఫ్రాంచైజీ భాగస్వామి గౌతమి సూర్య శ్రీపతి, నరేన్ గ్రూప్ చైర్మన్ నరేంద్రనాథ్ చగన్లాతో కలిసి ప్రారంభించారు.

అందం ఆనందాన్ని ఇవ్వడమే కాదు.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని జబర్ధస్త్ వర్షా అన్నారు. ఒకప్పుడు ఎంతో ఖరీదైన బ్యూటీ సేవలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చాయన్నారు. ప్రీమియం సేవలను అందుబాటులో ఉండే ధరల్లో అందించడం మానియా ప్రత్యేకత అన్నారు. 

ప్రాంచైజీ భాగస్వామి గౌతమి సూర్య శ్రీపతి మాట్లాడుతూ.. “మానియా సెలూన్‌లో గ్రూమింగ్, హెయిర్‌కట్, కలరింగ్, హెయిర్ ట్రీట్మెంట్స్, హెయిర్‌కేర్, స్కిన్‌కేర్, బాడీ కేర్, మేకప్ వంటి అన్ని రకాల బ్యూటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలతో  ఈ సెలూన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కో ఫౌండర్లు ఉదయ్ కుమార్ కొనేరు, పివి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో మానియా బ్రాండ్‌ను మరింత విస్తరించబోతున్నాం. పాన్ ఇండియా స్థాయిలో కొత్త సెలూన్స్‌ను ప్రారంభిస్తాం” అని తెలిపారు. మానియా సెలూన్స్ నిర్వహకులు పి.వి.శ్రీనివాస్,  సోమనాథ్ తదితరులు హాజరయ్యారు.