2 July, 2026 | 3:37 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

లేండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలి

14-04-2025 01:40 AM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 

జుక్కల్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తౌలాఖనాల ప్రాజెక్టు మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా వాటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే కోట లక్ష్మి శాంతారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని  ఎర్రమంజిల్ లో  గల జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఇందులో జుక్కల్ ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. సింగితం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్ పనులతో పాటు పెద్ద ఏడ్గి కాల్వ కు మరమ్మత్తులు, బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మత్తులు చేయాలన నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి గారికి విన్నవించగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.