03-08-2025 11:29:27 PM
ఎస్ కే. సాబీర్ పాషా సీపీఐ జిల్లా కార్యదర్శి
మాజీ డిసియంయస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సేవాలాల్ సేన ఆశయాలు కొనసాగించిన గొప్ప వ్వక్తి లాల్ సింగ్ నాయక్ అనే సిపిఐ జిల్లా కార్యదర్శి షబ్బీర్ భాష, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని పాండు రంగాపురం గ్రామంలో భూక్య లాల్ సింగ్ నాయక్ స్మారక విగ్రహం ఆయన కుమారులు హుస్సేన్ నాయక్, హేమల్లీ గోవింద్ అమల, మోహన్, సంధ్య రమేష్ రాథోడ్ లీలా, కుమార్తెలు శాంతి, సావిత్రి, చంద్య దారావత్, మాలోత్ హరి ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నూతన స్మారక విగ్రహం వారు ప్రారంభించారు.
పెద్ద బాలశిక్ష పుస్తకం ఉచిత పంపిణీ చేసిన లెనిన్ రాథోడ్..
ఇల్లందులపాడు తండా, ప్రాథమిక పాఠశాల పాండు రంగాపురం, జిల్లాపరిషత్ పాఠశాల పాండురంగాపురం విద్యార్థులకు భూక్య లాల్ సింగ్ గారి జ్ఞాపకంగా పెద్ద బాలశిక్ష రమేష్ రాథోడ్ తనయుడు లెనిన్ రాథోడ్. అక్షయ రాథోడ్ పంపిణీ చేసారు. ఈ సందర్బంగా పుస్తకం పంపిణీ సందర్బంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ చదువు మాత్రమే మన జీవితం మార్చగలదు అనీ, మీ జ్ఞాన సంపద అభివృద్ధినీ కాంక్షిస్తూ పుస్తక పంపిణీ చేసినట్లు అయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్మారక విగ్రహం ముందు ఇవాళ పాండురంగాపురం నివాసి పిట్టల వెంకన్న మామిడి మొక్కనాటినారు.