calender_icon.png 4 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలవెలుగు స్కూల్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

04-08-2025 12:00:00 AM

మణుగూరు, ఆగస్ట్ 3 (విజయక్రాంతి) : మండల కేంద్రంలోనిబాలవెలుగు అనాధ పాఠశాలలో ఆదివారం టీబీజీకేఎస్  నిర్వ హించిన స్నేహితుల దినోత్సవవేడు కలు ఎంతో ఘ నంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు విచ్చేసి విద్యార్థులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారని,

భూమ్మీద అమ్మ ,నాన్న అనే పిలుపు తర్వాతఆత్మీయమైన పిలుపుస్నేహమని, స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండరాదన్నా రు. ఆపదలో ఆదుకునే వారే నిజమైన మిత్రులుగా ఆయన పేర్కొన్నారు. ఇతిహాసాల్లో కూడా కృష్ణుడు,కుచేలుడుల స్నేహం, రామ, సు గ్రీవుల స్నేహం ఎందరికో ఆదర్శ మని వివరించారు. విద్యార్థు లందరూ మంచి స్నేహతత్వాన్ని అల వర్చుకుని మంచి మిత్రులుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.

అనంతరం అ నాధ పిల్లలకు  తమ స్నేహంకు గుర్తుగా ఫ్రెండ్షిప్ బ్యాడ్జి కట్టి చాక్లెట్, బిస్కెట్లను పంచి పెట్టి ఆ నందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఆచా ర్యులు బండ జగన్మోహన్ రెడ్డి, టీబీజీ కే ఎస్ నాయకులు  బంగారి పవన్ కుమార్, ముకేశ్ కుమార్, జంగం రాజ్ కుమార్, రాజేందర్, తిరుపతి, నాగరాజు, పాఠశాల సిబ్బంది  పాల్గొన్నారు.