calender_icon.png 4 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ 2వ స్టేట్ పోలీస్ డ్యూటీమీట్‌లో ఎస్‌ఐకి 3 మెడల్స్

04-08-2025 12:00:00 AM

అభినందన తెలిపిన అధికారులు

భద్రాచలం, ఆగస్టు 3, (విజయక్రాంతి) :తెలంగాణ 2వ స్టేట్ మీట్ లో 2025 పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మూడవ స్థానం లభించింది. ఈ పోటీలలో భద్రాచలం ఎస్త్స్ర గంజి స్వప్న 3 మెడల్స్ సాధిం చారు. (2 సిల్వర్ మెడల్స్, 1 బ్రాస్ మోడల్) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ & క్రిమినల్ లా (రిటన్ టెస్ట్), ఫోరెన్సిక్ సైన్స్ (రిటన్ టెస్ట్) , సైంటిఫిక్ అండ్ ఇన్వెస్టిగేషన్ (ఐఓ ఫోటోగ్రఫీ) లో పోటీలలో మెడల్స్ సాధించారు.

అదేవిధం గా జూలై నెలలో వరంగల్ లో జరిగిన జో నల్ మీట్ లో ఎస్త్స్ర గంజి స్వప్న రెండు గోల్ మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా అధికారులు పలువురు స్వప్నకు అభినందనలు తెలిపారు. స్టేట్ లెవెల్ లో 3 , జోన్ లెవల్ లో 2 మెడల్స్ సాధించడం పట్ల వారు హ ర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా త్వరలో జరిగే నేషనల్ స్థాయి 69వ యూపీ నేషనల్ మీట్‌లో ఎస్త్స్ర స్వప్న పాల్గొననున్నారు.