12-11-2025 12:00:00 AM
నస్కల్ గ్రామంలో విషాదం
రామాయంపేట, నవంబర్ 11 : రామాయంపేట ఉమ్మడి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బక్కన్నగారి లాలాగౌడ్ (53) కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్ వద్ద ఆయన నడుపుతున్నహోటల్ సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. లాలాగౌడ్ హోటల్ పక్కన ఉన్నషెడ్కు ఆనుకుని ఉన్న సపోర్ట్ స్టాండ్ను పట్టుకోగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలింది.
దాంతో లాలాగౌడ్ కుప్పకూలగా, వెంటనే అక్కడే ఉన్న వినయ్ తన మెడలోని టవల్తో ఆయనను పైకి లాగాడు. అయితే అప్పటికే లాలాగౌడ్ మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటన సమయంలో ఇద్దరూ హనుమాన్ మాలలు ధరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.