27 March, 2026 | 4:27 AM

ఐదు రోజుల ఉత్కంఠకు తెర

04-05-2024 01:51 AM

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

వైద్య పరీక్షల అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు తరలింపు 

రాజేంద్రనగర్, మే 3 (విజయక్రాంతి): ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు చిరుత అటవీ శాఖ అధికారులు ఏర్పా టు చేసిన బోనులో గురువారం రాత్రి చిక్కిం ది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ శంషాబాద్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహ్మద్ ఇష్రద్ హైమద్ శుక్రవారం వివరాల వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామం నుంచి శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం ప్రవేశించినట్లు గుర్తించారు. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందించి చిరుతను పట్టుకునేందుకు 25 సీసీ ట్రాప్ కెమెరాలు, 5 బోన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామస్తులను సైతం అప్రమత్తం చేశారు. ఎట్టకేలకు గురువారం రాత్రి బోనులో ఉన్న మేకను పట్టుకునేందుకు చిరుతపులి రావడంతో బోనులో చిక్కినట్లు వెల్లడించారు. ఈ మేరకు చిరుతను జూకు తరలించి వైద్య పరీక్షల అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.