calender_icon.png 26 July, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఏసీ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేద్దాం

25-07-2025 02:31:50 PM

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): తెలంగాణ బీసీ ,ఎస్సీ ,ఎస్టీ రైట్స్  జేఏసీ తోనే  తెలంగాణ అణగారిన వర్గాలకు అధికారాన్ని సాధిస్తామని  జేఏసీ రాష్ట్ర నాయకులు(JAC state leaders) బరిగల దుర్గప్రసాద్ మహారాజ్  అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని   ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ,ఎస్సీ ,ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సును 27 ఆదివారం నల్లగొండ పట్టణంలో  పి ఆర్ టి యు భవన్ లో నిర్వహించినట్లు తెలిపారు.ఈ ఆవిర్భావ సదస్సు కు  విశారదన్ మహరాజ్, రిటైర్డ్ ఐఏఎస్  టి. చిరంజీవులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14న మాభూమి రథయాత్ర పేరుతో  తెలంగాణలో  భూమి, రాజ్యం ,సంపదపై జరుగుతున్న దోపిడిని జమీందారీ వ్యవస్థని, భూస్వామ్య వ్యవస్థని 10% శాతం లేని అగ్రకులాల పరిపాలన అవినీతిని మా భూమి" రథయాత్ర ద్వారా  విశారదన్ మహరాజ్   బయట పెట్టనున్నారని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో బీసీ, ఎస్సీ ,ఎస్టీలు 90% ఉండగా మూడున్నర కోట్ల మంది అన్నగారిన వర్గాలకు రాజ్యాధికారం అందనoత దూరంగా ఉందన్నారు. అందుకే తెలంగాణ బీసీ ,ఎస్సీ ,ఎస్టీ రైట్, రాజ్యాధికార  సాధన జేఏసీ  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాధికార చైతన్యాన్ని తీసుకురానున్నట్టుగా పేర్కొన్నారు. ఈనెల 27న  నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు పెద్ద ఎత్తున బీసీ ,ఎస్సీ ,ఎస్టీలు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు బోగోజు మహేశ్వర చారి  ,కళ్యాణ్ గౌడ్ , రాచమల్ల కృష్ణ యాదవ్, తలారి రాంబాబు, శంకర్, వినోద్,,లింగాయన్ ,జగన్,రవి, వంశి,సైదులు, సైదన్  తదితరులు పాల్గొన్నారు.